![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన 'వలిమై' మూవీ ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోంది. జీ5 లో స్ట్రీమింగ్ మొదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలోనే ఇప్పటివరకు ఏ మూవీకి రానటువంటి అతిపెద్ద ఓపెనింగ్స్ తో ఈ మూవీ దూసుకుపోతోంది.
'వలిమై' మార్చి 25 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విడుదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకుంది. ఇందులో అజిత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ పాత్రలో నటించగా, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించాడు. థియేటర్స్ లో విడుదల సమయంలో సినిమా నుండి తొలగించబడిన సీన్స్ కూడా ఇప్పుడు ప్రసారం చేయబడుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది.
హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.
![]() |
![]() |