![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా 2007 లో 'చిరుత' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాకి లుక్స్, యాక్టింగ్ పరంగా విమర్శలు ఎదుర్కొన్న చరణ్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్ అందుకొని నటుడిగా తనని తాను మార్చుకుంటూ స్టార్ గా ఎదిగాడు. అయితే కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో చరణ్ దారుణంగా ట్రోల్ కి గురయ్యాడు. ఇతను హీరోనా అంటూ హేళన చేశారు. అయితే తనని జీరో అన్న వాళ్లే చేతే క్లాప్స్ కొట్టించుకుంటున్నాడు చరణ్.
టాలీవుడ్ లో మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న చరణ్ 2013లో జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. 1973 లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'జంజీర్'కి రీమేక్ ఇది. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఆ సమయంలో బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్ ని బాగా విమర్శించారు. అసలు మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదు.. ఇతను హీరోనా అంటూ ట్రోల్ చేశారు. ఆ దెబ్బతో చరణ్.. హిందీ సినిమాల జోలికి పోలేదు.
ఇప్పుడు దాదాపు 9 ఏళ్ల తర్వాత రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' తో హిందీ ప్రేక్షకులను పలకరించాడు చరణ్. ఈ మూవీలో చరణ్ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ కి బాలీవుడ్ ఆడియన్స్, క్రిటిక్స్ సైతం ఫిదా అవుతున్నారు. అప్పుడు ఎవరైతే ట్రోల్ చేశారో.. ఇప్పుడు వాళ్లే చరణ్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటన అద్భుతమంటూ సోషల్ మీడియా వేదికగా చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
![]() |
![]() |