![]() |
![]() |

దర్శకధీరుడు రాజమౌళి తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`.. శుక్రవారం జనం ముందుకొచ్చింది. తొలి రోజు వసూళ్ళ పరంగా అనేక చోట్ల సరికొత్త రికార్డులను నెలకొల్పింది ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్. దీంతో.. జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ చేరినట్లేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలా ఉంటే, `ఆర్ ఆర్ ఆర్` తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాదు.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుందని టాక్. లేటెస్ట్ బజ్ ఏంటంటే, మహేశ్ - జక్కన్న కాంబో మూవీ.. విజయదశమికి పట్టాలెక్కనుందట. అదే విధంగా 2024లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకొచ్చే అవకాశముందంటున్నారు. త్వరలోనే మహేశ్ - రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, మహేశ్ ప్రస్తుతం `సర్కారు వారి పాట`తో బిజీగా ఉన్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే 12న విడుదల కానుంది. ఆపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా చేయనున్నారు మహేశ్. అదయ్యాకే రాజమౌళి డైరెక్టోరియల్ సెట్స్ పైకి వెళుతుందని చెప్పుకుంటున్నారు.
![]() |
![]() |