![]() |
![]() |

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్' సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని 'తగ్గేదేలే' అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు 'తగ్గేదేలే' అంటూ సందడి చేశారు. క్రికెటర్స్ కి సైతం తగ్గేదేలే ఫీవర్ అంటుకోవడం విశేషం. అదే స్థాయిలో ఇప్పుడు 'తొక్కుకుంటూపోవాలే' హవా మొదలైంది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ తో ఏకంగా 'బాహుబలి-2' రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలోని తారక్ చెప్పిన 'తొక్కుకుంటూపోవాలే' అనే డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ 'తొక్కుకుంటూపోవాలే' అని రాసున్న బ్యానర్స్ కట్టడంతో పాటు.. అదే స్లోగన్ తో థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. ట్విట్టర్ లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. తారక్ యాక్టింగ్ అదరగొట్టడంతో పాటు, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుండటంతో 'తొక్కుకుంటూపోవాలే' అనే హ్యాష్ ట్యాగ్ మారుమోగిపోతోంది.
![]() |
![]() |