![]() |
![]() |

రీసెంట్ టైమ్స్ లో తెలుగు సినిమా అడవి బాట పట్టింది. మరీముఖ్యంగా.. మెగా కాంపౌండ్ కి చెందిన కథానాయకులు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీస్ తో వరుసగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అంతేకాదు.. బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించగా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన `పుష్ప - ద రైజ్` అడవి చుట్టూ తిరిగే కథతో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ బాట పట్టగా.. గత నెల చివరలో రిలీజైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` కూడా అటవీ నేపథ్యంతో రూపొంది చెప్పుకోదగ్గ విజయం సాధించింది. అంతేకాదు.. ఈ శుక్రవారం జనం ముందు నిలిచిన `ఆర్ ఆర్ ఆర్` కూడా అడవి నేపథ్యంలోనే తయారై కాసుల వర్షం కురిపిస్తోంది. మల్టిస్టారర్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. ఏప్రిల్ 29న రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం `ఆచార్య` కూడా అలరిస్తుందేమో చూడాలి. రామ్ చరణ్ మరో కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కొంతమేర ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని సమాచారం. మొత్తమ్మీద.. మెగా కాంపౌండ్ టాప్ స్టార్స్ అంతా వరుసగా అడవి బాటలో వెళుతూ కాసుల పంట పండిస్తున్నారన్నమాట.
![]() |
![]() |