![]() |
![]() |

తెలుగు తెరపై చాలా కాలం తరువాత వచ్చిన సిసలైన మల్టిస్టారర్.. `ఆర్ ఆర్ ఆర్`. ఒకే తరానికి చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. పాన్ - ఇండియా మూవీగా నిన్న (మార్చి 25) రిలీజై వరల్డ్ వైడ్ గా కనివినీ ఎరుగని వసూళ్ళతో సంచలనం సృష్టిస్తోంది. అటు తారక్, ఇటు చరణ్ ఇద్దరికి కూడా రాజమౌళి ఫ్యాక్టర్ మరోసారి కలిసొచ్చినట్లయ్యింది.
ఇదిలా ఉంటే, గతంలో ఇదే మార్చి నెలలో చెరో అద్భుత విజయాన్ని మూటగట్టుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్.. `ఆర్ ఆర్ ఆర్`తో ఆ నెల వేదికగా మరో మెమరబుల్ మూవీని తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. 2002 మార్చి నెలలో రిలీజైన `ఆది`తో కెరీర్ లో తొలి సెన్సేషనల్ హిట్ క్రెడిట్ చేసుకున్న తారక్.. 20 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్`తో పలకరించి మెప్పించారు. ఇక చరణ్ విషయానికి వస్తే.. `రంగస్థలం` (2018) తరువాత రెండోసారి మార్చి నెలలో ఎంటర్టైన్ చేసి మరో సంచలన విజయం అందుకున్నారు. మొత్తమ్మీద.. మార్చి నెల తారక్, చరణ్ కి సెకండ్ టైమ్ కూడా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. మరి.. భవిష్యత్ లోనూ ఈ సెంటిమెంట్ కొనసాగుతుందేమో చూడాలి.
![]() |
![]() |