![]() |
![]() |

`స్టూడెంట్ నెం 1`, `సింహాద్రి`, `యమదొంగ` వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ క్రేజీ మల్టిస్టారర్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు తారక్. శుక్రవారం జనం ముందు నిలిచిన ఈ పిరియడ్ డ్రామా.. అనూహ్య స్థాయిలో వసూళ్ళు ఆర్జిస్తూ బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్ కి `ఆర్ ఆర్ ఆర్` వరుసగా ఆరో విజయం. `టెంపర్` (2015), `నాన్నకు ప్రేమతో` (2016), `జనతా గ్యారేజ్` (2016), `జై లవ కుశ` (2017), `అరవింద సమేత వీర రాఘవ` (2018).. ఇలా ఇప్పటికే ఐదు `నాన్ - ఫెయిల్యూర్` మూవీస్ తో పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించిన తారక్.. ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్`తో డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్లయ్యింది. మొత్తమ్మీద.. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఆరు విజయాలతో జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలుస్తున్నారు.
కాగా, `ఆర్ ఆర్ ఆర్` తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివతో తన నెక్స్ట్ వెంచర్ చేయనున్నారు తారక్. పాన్ - ఇండియా మూవీగానే రిలీజ్ కానున్న ఈ సినిమాతోనూ ఎన్టీఆర్ విజయపరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |