![]() |
![]() |
.webp)
'బాహుబలి' తర్వాత సినీ లవర్స్ ఆ రేంజ్ లో వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. 'బాహుబలి'తో సంచనలం సృష్టించిన రాజమౌళి తన తదుపరి సినిమాని.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేస్తానని ప్రకటించడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ ముగ్గురు కలిస్తే ఇక నాన్ బాహుబలి రికార్డులు అని చెప్పుకొనే రోజులు పోయి నాన్ 'ఆర్ఆర్ఆర్' రికార్డులు అని చెప్పుకొనే రోజులు వస్తాయని భావించారంతా. అనుకున్నట్టులాగానే మొదటి రోజు ఊహకందని కలెక్షన్స్ తో సత్తా చాటింది 'ఆర్ఆర్ఆర్'.
ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల్లో రూ.43 కోట్లతో 'బాహుబలి-2' మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆ స్థానంలోకి 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఈ సినిమా ఏకంగా 74.11 కోట్ల షేర్ రాబట్టింది. ఏరియాల వారిగానూ ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నైజాంలో ట్రిపులార్ మూవీ ఏకంగా 23.35 కోట్ల షేర్ సాధించి సరికొత్త రికార్డును సాధించింది. నైజాంలో 'భీమ్లా నాయక్' పేరిట ఉన్న రూ. 11.85 కోట్ల షేర్ రికార్డును 'ఆర్ఆర్ఆర్' దాదాపు రెట్టింపు మార్జిన్ తో తుడిచిపెట్టింది. అలాగే సీడెడ్ లో ఫస్ట్ డే 17 కోట్ల షేర్ రాబట్టి.. వినయవిధేయరామ పేరిట ఉన్న 11.75 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. ఆంధ్రాలోనూ ఫస్ట్ డే ఓవరాల్ గా 33.76 కోట్ల షేర్ కలెక్ట్ చేసి.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గానూ 'బాహుబలి-2' రికార్డులను 'ఆర్ఆర్ఆర్' బ్రేక్ చేసింది. కర్ణాటకలో 8.15 కోట్ల షేర్, తమిళనాడు 4.95 కోట్లు, కేరళ 1.74 కోట్లు, హిందీ 9.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 2.80 కోట్లు, ఓవర్సీస్ 34 కోట్లు.. ఇలా అన్ని చోట్లా రికార్డు షేర్స్ రాబట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ లో బాహుబలి-2 ని బీట్ చేసింది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా 123 కోట్ల షేర్(215 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేయగా.. 135 కోట్ల షేర్(235.55 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. అలాగే యూఎస్ లో ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి 5 మిలియన్ మార్క్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ సంచలనం సృష్టించింది.
ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా 451 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో 191 కోట్ల బిజినెస్ చేసింది. ఫస్ట్ డే వచ్చిన రికార్డు కలెక్షన్స్ ని బట్టి చూస్తే వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |