![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది.
'గని' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. 'కొడితే' అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ వీడియో ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. ఇక తాజాగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ 'కొడితే' ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు. తమన్నా తనదైన డ్యాన్స్, గ్లామర్ తో మరోసారి ఫిదా చేసింది. తమన్ మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. రినైసెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై సిద్ధు ముద్దా, అల్లు బాబీ ఈ సినిమాని నిర్మించారు.
![]() |
![]() |