![]() |
![]() |

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన రాశీ ఖన్నా.. ఆ తర్వాత 'జై లవ కుశ', 'తొలిప్రేమ', 'ప్రతిరోజూ పండగే' వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా తాజాగా బాడీ షేమింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ లో తనని గ్యాస్ ట్యాంకర్ అని కామెంట్ చేసేవారని చెప్పింది.
ఇటీవల 'రుద్ర' అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన రాశీ ఖన్నా.. తాజాగా ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కెరీర్ ప్రారంభంలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని తెలిపింది. కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి పాత్రల్లో నటించే అవకాశమొచ్చిందని, అదే సమయంలో శరీరాకృతి పరంగా విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పింది. కొంచెం బొద్దుగా ఉండటం వల్ల సౌత్ వాళ్ళు తనని గ్యాస్ ట్యాంకర్ అని కామెంట్ చేసేవారని తెలిపింది. ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగాలంటే నాజుకుగా ఉండాలని అర్థమై, బరువు తగ్గానని చెప్పింది. ఎవరో అన్నారని తాను సన్నబడలేదని, తన ప్రొఫెషన్ కోసం సన్నబడ్డానని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' తెలుగు సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ పుర్తిచేసుకున్నాయి. అలాగే తమిళ్ సినిమాలతో పాటు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.
![]() |
![]() |