![]() |
![]() |
.webp)
రీమేక్స్ రూపొందించడంలో దర్శకుడు హరీశ్ శంకర్ తీరే వేరు. తెలుగు నెటివేటికి తగ్గట్టు ఆయన తెరకెక్కించిన రీమేక్ మూవీస్ `గబ్బర్ సింగ్` (2012), `గద్దలకొండ గణేశ్` (2019) బాక్సాఫీస్ ముంగిట మంచి వసూళ్ళు రాబట్టాయి. అలాంటి హరీశ్ త్వరలో మరో రీమేక్ చేయబోతున్నారట. అది కూడా.. `మెగా` కాంపౌండ్ లోనే!
ఆ వివరాల్లోకి వెళితే.. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మలయాళ చిత్రం `బ్రో డాడీ`.. ఈ ఏడాది జనవరి 26న అమెజాన్ ప్రైమ్ లో నేరుగా స్ట్రీమ్ అయి విశేష వీక్షకాదరణ పొందింది. కట్ చేస్తే.. ఈ కామెడీ డ్రామాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మోహన్ లాల్ పోషించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారని బజ్. అంతేకాదు.. ఈ రీమేక్ ని హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తారని చెప్పుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `గబ్బర్ సింగ్`, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో `గద్దలకొండ గణేశ్` తీసి మెగా కాంపౌండ్ లో రెండు `రీమేక్` హిట్స్ కొట్టిన హరీశ్.. మెగాస్టార్ కాంబోలో `బ్రో డాడీ`తో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి మరి. త్వరలోనే `బ్రో డాడీ` రీమేక్ పై క్లారిటీ రానున్నది.
కాగా, ప్రస్తుతం హరీశ్ శంకర్ చేతిలో `భవదీయుడు భగత్ సింగ్` చిత్రం ఉంది. పవన్ టైటిల్ రోల్ లో నటించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
![]() |
![]() |