![]() |
![]() |

`రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`.. ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు మాస్ మహారాజా రవితేజ. ఈ మూడు చిత్రాలు కూడా ఇదే ఏడాది తెరపైకి రాబోతున్నాయి. వీటిలో `రామారావు ఆన్ డ్యూటీ` జూన్ 17న రిలీజ్ కానుండగా.. `రావణాసుర` సెప్టెంబర్ 30న సందడి చేయనుంది. `ధమాకా` కూడా ఇదే సంవత్సరం ఎంటర్టైన్ చేయనుంది.
ఇదిలా ఉంటే, `టైగర్ నాగేశ్వరరావు` పేరుతో రవితేజ ఓ బయోపిక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది. 1970ల నేపథ్యంలో సాగే ఈ పిరియడ్ డ్రామా.. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథగా తెరకెక్కనుంది. వంశీ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించనున్నారు. కాగా, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 2న ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారట. ఆపై జూన్ లేదా జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2023 వేసవిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మరి.. రవితేజ ఫస్ట్ పాన్ - ఇండియా అటెంప్ట్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |