![]() |
![]() |

ప్రస్తుతం తమిళనాట హవా సాగిస్తున్న సంగీత దర్శకుల్లో అనిరుధ్ ఒకరు. దాదాపుగా కోలీవుడ్ అగ్ర కథానాయకులందరి కాంబినేషన్స్ లోనూ అనిరుధ్ సినిమాలు చేశాడు. తెలుగులోనూ `అజ్ఞాతవాసి`, `జెర్సీ`, `గ్యాంగ్ లీడర్` వంటి సినిమాలకు అనిరుధ్ బాణీలు అందించాడు. కాగా, త్వరలో పట్టాలెక్కనున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - విజనరీ కెప్టెన్ కొరటాల శివ కాంబినేషన్ మూవీకి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబో ప్రాజెక్ట్ కి స్వరకర్తగా అనిరుధ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.
Also Read: మీరు 'ఆర్ఆర్ఆర్' బాయ్‌కాట్ చేస్తే మేం 'కేజీఎఫ్-2' చేస్తాం
ఇదిలా ఉంటే, తెలుగులో తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అనిరుధ్. ఆ వివరాల్లోకి వెళితే.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత జంటగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `నిన్ను కోరి`, `మజిలీ`, `టక్ జగదీశ్` చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ రూపొందించనున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. కాగా, ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూర్చనున్నట్లు ఇన్ సైడ్ టాక్. త్వరలోనే విజయ్ - శివ కాంబో మూవీలో అనిరుధ్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
![]() |
![]() |