![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' మూవీ రికార్డుల వేట మొదలైంది. విడుదలకు ముందే ఈ సినిమా ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో ఈ సినిమా ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటి ఇండియన్ సినీ చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డులను రాజమౌళి దర్శకత్వంలోనే తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' బ్రేక్ చేస్తుండటం విశేషం. అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్‌లో 2.4 మిలియన్ డాలర్లను వసూలు చేసింది 'బాహుబలి-2'. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి ఆ రికార్డు బ్రేక్ చేసింది. అంతేకాదు 3మిలియన్ మార్క్ వైపు పయనిస్తూ మునుపెన్నడూ చూడని బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది.

అలాగే సినీమార్క్ థియేటర్స్ సింగిల్ చైన్ లో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ తో 1 మిలియన్ మార్క్ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో నేడే (మార్చి 24) ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇండియాలోనూ అర్థరాత్రి నుంచి స్పెషల్ షోలు స్టార్ట్ కానున్నాయి.
![]() |
![]() |