![]() |
![]() |

పాన్ - ఇండియా బ్లాక్ బస్టర్ `కేజీఎఫ్`కి సెకండ్ పార్ట్ గా రూపొందిన `కేజీఎఫ్ ఛాప్టర్ 2`.. వేసవి కానుకగా ఏప్రిల్ 14న పలు భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన ఈ పిరియడ్ డ్రామాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారతీయ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Also Read: మూడు గంటల పైగా సినిమా చూపించనున్న రాజమౌళి!
ఇదిలా ఉంటే, `కేజీఎఫ్ ఛాప్టర్ 2`కి పోటీగా మరో బిగ్ టికెట్ ఫిల్మ్ బరిలోకి దిగబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ సినిమానే.. `బీస్ట్`. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా `డాక్టర్` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్నట్లు కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ 14న కాకుండా ఒక రోజు ముందే `బీస్ట్` థియేటర్స్ బాట పట్టనుందట. సో.. ఏప్రిల్ 13కి `బీస్ట్` ఆగమనం ఉండబోతోందన్నమాట. ఎలా చూసినా.. `కేజీఎఫ్ ఛాప్టర్ 2`కి, `బీస్ట్`కి మధ్య బాక్సాఫీస్ వార్ అయితే తప్పడం లేదనే చెప్పాలి. త్వరలోనే `బీస్ట్` విడుదల తేదిపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరి.. `కేజీఎఫ్ ఛాప్టర్ 2` వర్సెస్ `బీస్ట్` అన్నట్లుగా ఉన్న ఈ పోటీలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి.
![]() |
![]() |