![]() |
![]() |

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ - ఇండియా మూవీస్ లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. భారీ బడ్జెట్ చిత్రాలకు చిరునామాగా నిలిచిన ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ దివా దీపికా పదుకోణె అభినయిస్తోంది. ప్రముఖ హిందీ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కి బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, `ప్రాజెక్ట్ కె`లో అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో పురాణ పాత్ర అశ్వథ్థామ వేషంలో బిగ్ బి ఎంటర్టైన్ చేయనున్నారట. మరణమే లేని పురాణ పాత్రగా ప్రసిద్ధమైన అశ్వథ్థామ.. ఇప్పటికీ బతికే ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే బిగ్ బి రోల్ ని డిజైన్ చేశారట. అలాగే, మరికొన్ని పాత్రలు కూడా పురాణాల నుంచి స్ఫూర్తితోనే రూపొందాయని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, 2023 వేసవిలో `ప్రాజెక్ట్ కె` ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనుందని ఇన్ సైడ్ టాక్.
![]() |
![]() |