![]() |
![]() |

టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత ఊహించని విధంగా విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి విడాకులకు కారణమేంటో తెలీదు కానీ.. ఇద్దరూ ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. సమంత అయితే చైతన్యకి పూర్తిగా దూరం జరుగుతుంటే.. చైతన్య మాత్రం సోషల్ మీడియాలో సమంతను ఇంకా ఫాలో అవుతున్నాడు. దీంతో సమంతను చైతన్య మరిచిపోలేకపోతున్నాడా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాము భార్యాభర్తలుగా విడిపోయినా, ఫ్రెండ్స్ లా ఉంటామని విడాకుల ప్రకటన సమయంలో చైతన్య, సమంత చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఉన్నట్లు కనిపించట్లేదు. సమంత సోషల్ మీడియాలో చైతన్యకి సంబంధించిన ఫోటోలు, పోస్ట్ లు అన్నీ డిలీట్ చేసింది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో చైతన్యను అన్ ఫాలో చేసింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన అఖిల్, సుశాంత్, వెంకటేష్, రానా ఇలా ఎందరినో ఫాలో అవుతున్న సమంత.. చైతన్యను అన్ ఫాలో చేయడం గమనార్హం.

మరోవైపు సమంతను ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో చైతన్య ఫాలో అవుతూనే ఉన్నాడు. అంతేకాదు సమంతతో కలిసి ఉన్న ఫొటోలను కూడా డిలీట్ చేయలేదు. దీంతో చైతన్యను సమంత పూర్తిగా దూరం పెట్టినా.. చైతన్య మాత్రం సమంతను ఇంకా మార్చిపోలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |