![]() |
![]() |

తెలుగు సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తే గొప్ప అనుకునే రోజులు పోయి.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రెండొందలు కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసే రోజులు వచ్చాయి. 'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో అంతకుమించిన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమయ్యాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. నైజాం(తెలంగాణ)లో ఈ సినిమా రూ.75 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో ఇప్పటిదాకా హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన మూవీ రాజమౌళి డైరెక్ట్ చేసిన 'బాహుబలి-2'నే కావడం విశేషం. ఈ మూవీ నైజాంలో ఫైనల్ గా 68 కోట్ల షేర్ రాబట్టింది. అలాంటిది ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ బిజినెస్సే 75 కోట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 136 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. సీడెడ్ లో 45 కోట్లు, ఆంధ్రాలో 91 కోట్లు(ఉత్తరాంధ్ర 23 కోట్లు, ఈస్ట్ గోదావరి 15 కోట్లు, వెస్ట్ 13 కోట్లు, గుంటూరు 17 కోట్లు, కృష్ణ 14 కోట్లు, నెల్లూరు 9 కోట్లు) బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ, తెలంగాణలో కలిసి ఆర్ఆర్ఆర్ 211 కోట్ల బిజినెస్ చేసింది.
ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ రాబట్టిన బాహుబలి-2. ఈ సినిమా ఇరు రాష్ట్రాల్లో ఫైనల్ గా 204 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ బిజినెస్ రికార్డు స్థాయిలో 211 కోట్లు జరిగింది. దీనిని బట్టి చూస్తే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 300 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది.
![]() |
![]() |