![]() |
![]() |

మొదటి భార్య అనిత అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన కొన్నాళ్ల తర్వాత తేజస్విని అలియాస్ వైగారెడ్డి అనే యువతిని రెండో వివాహం చేసుకున్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. కరోనా ఫస్ట్ లాక్ టైమ్‌లో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఇప్పుడు తేజస్విని నిండు గర్భిణి అని తెలియవచ్చింది. త్వరలోనే ఆమె బిడ్డను కననుండటంతో దిల్ రాజు ఎక్కువగా ఆమెతోనే గడుపుతున్నారు. సినిమాల నిర్మాణ పనులను ఆయన కజిన్ శిరీష్‌తో పాటు రాజు కుమార్తె హన్షితారెడ్డి, రాజు సోదరుని కుమారుడు హర్షిత్‌రెడ్డి చూసుకుంటున్నారు.
గమనించదగ్గ విషయమేమంటే ఇప్పటికే రాజు కుమార్తె హన్షితకు ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. అంటే ఇద్దరు పిల్లలకు తాత అయిన రాజు ఇప్పుడు రెండో భార్య ద్వారా మరోసారి తండ్రి కాబోతున్నారన్న మాట.
దిల్ రాజు ప్రస్తుతం రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్‌లో తమ బ్యానర్ 50వ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వీటితో పాటు 'ఎఫ్3', 'జెర్సీ' హిందీ రీమేక్, 'హిట్' హిందీ రీమేక్, 'శాకుంతలం', విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీని ఆయన తీస్తున్నారు.
![]() |
![]() |