![]() |
![]() |

దర్శకుడు ముప్పలనేని శివ రూపొందించిన చిత్రాల్లో సింహభాగం మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో `కోరుకున్న ప్రియుడు` ఒకటి. ఒక దశలో వరుస విజయాలతో ఆకట్టుకున్న కథానాయకుడు వడ్డే నవీన్.. ఈ సినిమాతోనే తొలిసారిగా వెండితెరపై దర్శనమివ్వడం విశేషం. వాస్తవానికి నవీన్ కి ఇది రెండో చిత్రం. తన ఫస్ట్ పిక్చర్ గా హోమ్ బేనర్ లో చేసిన `క్రాంతి` విడుదలలో జాప్యం జరగడంతో.. `కోరుకున్న ప్రియుడు` తొలుత వెలుగులోకి వచ్చింది. నవీన్ కి హీరోగా శుభారంభాన్నిచ్చింది. నవీన్ కి జంటగా ప్రేమ నటించిన ఈ సినిమాలో కళాభినేత్రి వాణిశ్రీ ఓ ప్రధాన పాత్రలో ఆకట్టుకోగా శ్రీహరి, ఏవీయస్, కాస్ట్యూమ్స్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
Also Read: ఒక్కో టికెట్ రూ.5000.. 'ఆర్ఆర్ఆర్' పేరుతో దోపిడీ
కోటి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు అప్పట్లో ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. టైటిల్ సాంగ్ అయిన ``కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు`` చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలాగే, ``ఓహో వయ్యారం.. వారెవా నీ పరువం``, ``న్యాయదేవతకి అగ్ని పరీక్ష``, ``కోయిలమ్మ``, ``మైనా మైనా``, ``నాటీ పాప`` గీతాలు కూడా రంజింపజేశాయి. శ్రీ వెంకట సాయి పిక్చర్స్ పతాకంపై డి. వెంకట రమణ, చింతాల లక్ష్మణ నిర్మించిన `కోరుకున్న ప్రియుడు`.. 1997 మార్చి 21న విడుదలైంది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |