![]() |
![]() |

మూవీని ప్రమోట్ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళి తీరే వేరు. సినిమాని ఏ రేంజ్ లో భారీగా తెరకెక్కిస్తారో.. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ నెవర్ బిఫోర్, ఎవరు ఆఫ్టర్ అన్నట్లుగా సాగుతున్నాయి. దేశవిదేశాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న ప్రమోషన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మార్చి 18 నుంచి మార్చి 23 వరకు హైదరాబాద్ లో మొదలై హైదరాబాద్ లో ముగిసేలా భారీగా ఈవెంట్స్ ప్లాన్ చేసారు. మార్చి 18 న దుబాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మార్చి 19 న కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్ లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కర్ణాటక సీఎం వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారోనని. మార్చి 20 న గుజరాత్‌లోని బరోడాలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని(Statue of Unity) ఆర్ఆర్ఆర్ టీం సందర్శించింది. మార్చి 20 న సాయంత్రం ఢిల్లీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా దానికి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.
ఇలా కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ లలో సందడి చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్ ఈరోజు(మార్చి 21) పంజాబ్ లోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ని సందర్శించింది. అక్కడ ప్రజల నుంచి టీమ్ కి భారీ స్థాయిలో స్వాగతం లభించడం విశేషం. రాజమౌళి, చరణ్, తారక్ అక్కడ సాంప్రదాయ వస్త్రాల్లో దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈరోజు సాయంత్రం జైపూర్, రేపు(మార్చి 22) కోల్‌కత్తా, వారణాసిలలో సందడి చేసి.. 23 న హైదరాబాద్ కి రానుంది ఆర్ఆర్ఆర్ టీమ్.
![]() |
![]() |