Home

»

Latest News

ఒక్కో టికెట్ రూ.5000.. 'ఆర్ఆర్ఆర్' పేరుతో దోపిడీ

Mar 21, 2022

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్ఆర్ఆర్' మూవీకి భారీ బడ్జెట్ అయిన నేపథ్యంలో పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో టికెట్ ధరలు మూడు నాలుగొందలకు పైగా ఉన్నాయి. ఒక సాధారణ ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే కేవలం టికెట్స్ కోసమే 1000 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు కొందరు బెనిఫిట్ షోల పేరుతో అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యారు.

'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ నటించిన సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. టికెట్ రేట్లు భారీగా పెంచినప్పటికీ ఈ సినిమా చూడటానికి సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక తారక్, చరణ్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ ఆతృతగా బెనిఫిట్ షోల గురించి ఆరాతీస్తున్నారు. అయితే ఈ అభిమానాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. 

హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోలు వేయడానికి రెడీ అవుతున్నారు. కానీ టికెట్ ధరలే ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కో బాల్కనీ టికెట్ ధర ఐదు వేలు చెబుతున్నారు. ఆ ధరలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కొందరైతే హీరోల మీద పిచ్చి అభిమానంతో అంత మొత్తం ఇచ్చి టికెట్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. బెనిఫిట్ షోలు చూసే ఫ్యాన్స్ లో ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు సినిమా కోసం ఇంత మొత్తం ఇంట్లో అడగలేక.. బయట అప్పులు చేసే అవకాశముంది. హీరోలపై కొందరికి ఉన్న పిచ్చి అభిమానాన్ని అడ్డుపెట్టుకొని ఈ రేంజ్ లో దోచుకోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com