![]() |
![]() |
.webp)
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే దక్షిణాది నటుల్లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒకరు. తమిళ చిత్రాలతో పాపులర్ అయిన సేతుపతి.. ఇప్పుడిప్పుడే ఇతర భాషల్లోనూ బిజీ అవుతున్నాడు. రీసెంట్ గా `సైరా.. నరసింహారెడ్డి`, `ఉప్పెన` వంటి తెలుగు చిత్రాల్లో అలరించిన విజయ్ సేతుపతి.. ప్రస్తుతం మలయాళం, హిందీ భాషల్లోనూ నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది వేసవి విజయ్ సేతుపతికి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఏప్రిల్, మే, జూన్ ఇలా మూడు వరుస నెలల్లో తక్కువ గ్యాప్ లోనే మూడు చిత్రాలతో పలకరించబోతున్నాడీ టాలెంటెడ్ యాక్టర్. ఆ వివరాల్లోకి వెళితే.. నయనతార, సమంత వంటి స్టార్ బ్యూటీస్ తో విజయ్ కలిసి నటించిన ముక్కోణ ప్రేమకథా చిత్రం `కాత్తువాక్కుల రెండు కాదల్` ఏప్రిల్ 28న రిలీజ్ కానుండగా.. తను కథానాయకుడిగా నటించిన `మామణిదన్` మే నెలలో విడుదలకు సిద్ధమైంది. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో చేస్తున్న `విక్రమ్` వేసవి చివరలో (జూన్ 3) తెరపైకి రానుంది. మరి.. సమ్మర్ స్పెషల్ గా ఎంటర్టైన్ చేయనున్న ఈ మూడు చిత్రాలతో విజయ్ సేతుపతి ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతాడో చూడాలి.
![]() |
![]() |