![]() |
![]() |

గత ఏడాది డిసెంబర్ 17న పాన్ - ఇండియా మూవీగా రిలీజైన `పుష్ప - ద రైజ్` ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీముఖ్యంగా.. హిందీనాట అనూహ్య స్థాయిలో వసూళ్ళు ఆర్జించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్థాయిని మరింత పెంచేసింది ఈ యాక్షన్ థ్రిల్లర్. అలాగే, దర్శకుడిగా సుకుమార్ ని మరో మెట్టు ఎక్కించింది.
కాగా, త్వరలో `పుష్ప` సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్` సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఏప్రిల్ నెలలో పట్టాలెక్కనున్న ఈ రెండో భాగాన్ని చకచకా పూర్తిచేసి సంవత్సరాంతంలో రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే, `పుష్ప` సెకండ్ పార్ట్ లో ఒకట్రెండు కొత్త పాత్రలు తోడవుతాయట. ఇందులో భాగంగానే.. ఒకప్పటి హీరోయిన్ కూడా ఈ సినిమాలో కనిపించబోతోందట. ఆమె మరెవరో కాదు.. `యమలీల`, `అమ్మ దొంగా`, `పెద్దన్నయ్య` వంటి బ్లాక్ బస్టర్స్ లో హీరోయిన్ గా ఎంటర్టైన్ చేసిన ఇంద్రజ. పుష్పరాజ్ బాల్యానికి చెందిన కొన్ని అదనపు సన్నివేశాల్లో ఇంద్రజ పాత్ర కనిపిస్తుందని.. అభినయానికి ఆస్కారముండేలా ఆ క్యారెక్టర్ ని సుక్కు డిజైన్ చేశారని బజ్. త్వరలోనే `పుష్ప - ద రూల్`లో ఇంద్రజ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
రష్మికా మందన్న కథానాయికగా కొనసాగనున్న `పుష్ప - ద రూల్`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |