![]() |
![]() |

వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన హిందీ ఫిల్మ్ 'ద కశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా ఉన్న ఈ సినిమాలో 1990లలో కశ్మీర్లో జరిగిన మారణకాండ, అనేకమంది కశ్మీర్ పండిట్లను చంపడం, స్త్రీలపై అత్యాచారాలు చేయడం, పిల్లలను కాల్చివేయడం లాంటి దారుణాలను చూపించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవీ జోషి, దర్శన్ కుమార్ లాంటి పేరుపొందిన నటులు నటించిన ఈ సినిమాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజేపీ అయితే ఈ సినిమాను సొంతం చేసుకొని, గొప్ప సినిమా అంటూ కీర్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాను చూడాలంటూ పిలుపునివ్వడం గమనార్హం.
అయితే ఈ సినిమా పొలిటికల్ ఎజెండాతో తీసిందనీ, అప్పటి మారణకాండలో కశ్మీరీ పండిట్లను మించి ఇతర కులాలు, మతాలకు చెందిన అనేక మంది హతులయ్యారనీ, ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాలో విస్మరించారనీ మరికొందరు విమర్శిస్తున్నారు. కొంతమంది కశ్మీరీ పండిట్లు ఈ సినిమా బీజేపీ ప్రాపగాండా అనీ, తమ గాయాలను నయం చేసే బదులు, వాటిని మరింత రేపెట్టేవిధంగా ఉందనీ చెప్పడాన్ని బీబీసీ లాంటి వార్తా సంస్థ ప్రసారం చేసింది.
లేటెస్ట్గా నటుడు ప్రకాశ్‌రాజ్ ఈ సినిమాపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. "#kashmirfiles ఈ ప్రాపగాండా సినిమా.. ఇది గాయాలను నయం చేస్తుందా లేక ద్వేషం అనే విత్తనాలను నాటి, గాయాలను రేపెడుతుందా #Justasking "అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఆయన కామెంట్లపై దుమ్మెత్తిపోయగా, కొంతమంది ఆయన వ్యాఖ్యల్ని సమర్ధించారు.
![]() |
![]() |