![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ అజిత్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో `శౌర్యం` శివ ఒకరు. వీరిద్దరి కలయికలో `వీరమ్` (2014), `వేదాళమ్` (2015), `వివేగమ్` (2017), `విశ్వాసమ్` (2019).. ఇలా ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో `వివేగమ్` మినహాయిస్తే మిగిలిన చిత్రాలన్నీ విజయపథంలో పయనించాయి. అజిత్, శివ కాంబినేషన్ ని కాస్త సక్సెస్ ఫుల్ కాంబోగా నిలిపాయి.
అలాంటి.. అజిత్, శివ కాంబినేషన్ లో మూడేళ్ళ తరువాత మరో సినిమా రాబోతోందట. ఆ వివరాల్లోకి వెళితే.. అజిత్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. `నేర్కొండ పార్వై`, `వలిమై` చిత్రాల తరువాత అజిత్, వినోద్ కాంబోలో వస్తున్న ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశముంది. ఆపై నయన్ ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ఓ మూవీ చేయబోతున్నారట అజిత్. అదయ్యేలోపే శివతో సినిమాని పట్టాలెక్కించబోతున్నారట. అంతేకాదు.. ఇందులో ప్రముఖ హాస్య నటుడు వడివేలు ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నారని సమాచారం. త్వరలోనే అజిత్, శివ కాంబినేషన్ లో రాబోతున్న ఐదో చిత్రంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
![]() |
![]() |