![]() |
![]() |

మలయాళంలో మంచి విజయం సాధించిన 'ఉడుంబు' తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి 'ర్యాంబో' అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు 'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు. రత్నాకరం అనిల్ రాజు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
హోలీ పండుగను పురస్కరించుకుని 'ర్యాంబో' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ర్యాంబోగా ఆశిష్ గాంధీ లుక్ ఆకట్టుకుంటోంది. మార్చి 28 నుంచి సెట్స్ కు వెళ్లనున్న ఈ క్రేజీ చిత్రానికి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.

సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరావు వర్క్ చేస్తున్నారు.
![]() |
![]() |