![]() |
![]() |

`పెళ్ళి సందD` చిత్రంతో తెలుగు తెరపై తొలిసారిగా సందడి చేసింది శ్రీలీల. మొదటి ప్రయత్నంలోనే తన నటనతో, నర్తనంతో కుర్రకారుని ఫిదా చేసింది. ఆ సినిమా తీసుకువచ్చిన గుర్తింపుతో ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో భాగమైంది ఈ ముద్దుగుమ్మ. వాటిలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న `ధమాకా` ఒకటి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, తాజాగా శ్రీలీల ఖాతాలో మరో క్రేజీ వెంచర్ చేరిందట. ఆ వివరాల్లోకి వెళితే.. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. `జూనియర్` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రాన్ని నితిన్ హోమ్ బేనర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించనుందట. అంతేకాదు.. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ హ్యారీస్ జైరాజ్ బాణీలు అందించబోతున్నారు. కాగా, ఈ ఫిల్మ్ లో నితిన్ కి జోడీగా శ్రీలీల ఎంపికైందని సమాచారం. త్వరలోనే నితిన్ - వక్కంతం వంశీ కాంబో మూవీలో శ్రీలీల ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, నితిన్ ప్రస్తుతం `మాచర్ల నియోజకవర్గం` సినిమా చేస్తున్నాడు. ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో నితిన్ కి జంటగా కృతి శెట్టి నటిస్తోంది.
![]() |
![]() |