![]() |
![]() |

విడుదలకు పది రోజుల ముందే 'ఆర్ఆర్ఆర్' సంబరాలు మొదలయ్యాయి. మార్చి 25 న విడుదల కానున్న 'ఆర్ఆర్ఆర్' కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాలు ప్రారంభించగా.. 'ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ యాంథమ్'తో ఆ సంబరాలను రెట్టింపు చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్.
'ఎత్తర జెండా' అంటూ సాగే 'ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ యాంథమ్'ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. తారక్, చరణ్ తో కలిసి ఆలియా భట్ చిందేసిన ఈ సాంగ్ కన్నుల పండుగగా ఉంది. "పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరులను తలచుకుంటూ" అంటూ రాజమౌళి చెప్పిన వాయిస్ తో సాంగ్ ప్రారంభమైంది. తారక్, చరణ్ నిజంగానే కోడెగిత్తల్లా ఆకట్టుకున్నారు. వారికి ధీటుగా ఆలియా భట్ అలరించింది.

ఫ్రీడమ్ ఫైటర్స్ కి డేడికేట్ చేస్తూ తెరకెక్కించిన సాంగ్ ఫ్యాన్స్ ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. తారక్, చరణ్, ఆలియా డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి సర్ ప్రైజ్ చేశారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ ఇలా ఎందరో మహానుభావులను స్మరించుకుంటూ రూపొందించిన ఆకట్టుకుంటోంది. ప్రేమ్ రక్షిత్ కోరియోగ్రఫీలో ఈ సాంగ్ తెరకెక్కింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
![]() |
![]() |