పవన్‌పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్..

posted on: Mar 14, 2022 4:03PM

బండ్ల గణేష్ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. నటుడిగా, నిర్మాతగా అంతకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు,  పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మహా వీరాభిమాని అని అందరికి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ను ప్రాణేశ్వరా అంటూ పలిచే ఒకే ఒక్క వ్యక్తి బండ్ల గణేష్ అని టాలీవుడ్‌లోనే కాదు.. పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌లో కూడా ఓ టాక్ అయితే ఉంది. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పడంలో.. జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ చేసిన తాజా కామెంట్స్ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  

వీరులారా ధీరులారా జనసేన సైనికులారా రండి కదలిరండి.. కడలి అలలా తరలి రండి ...నేను కూడా వస్తున్నాను.. మన దేవర నిజాయితీకి సాక్షిగా నిలబడడం కోసం తెలుగు వాణి వాడి వాడి నాడి వినిపించడం కోసం అమరావతి నుంచి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం, కలిసి పోరాడదామంటూ బండ్ల గణేష్ పిలుపు ఇచ్చారు. దీంతో ఈ సభకు వచ్చేందుకు జనసైనికులు కదం తొక్కుతోన్నారు.

అయితే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు అనుమతి ఇవ్వాలని పిబ్రవరి 28వ తేదీన జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నా.. ఈ సభ అనుమతిపై మార్చి 10వ తేదీ వరకు పోలీసులు స్పందించలేదు. దీంతో ఈ సభ అనుమతి కోసం జనసేన కీలక నేతలు హైకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సభ ఏర్పాట్లకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అదీకాక.. కృష్ణానది దుర్గమ్మ వారధిపై మార్చి 14వ తేదీ జనసేన సభ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నగర పాలక సంస్థ అధికారులు తొలగించారు. దీంతో జనసేన నేతలు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అంతలో పోలీసులు రంగం ప్రవేశం చేసి.. జనసేన నేతలను శాంతింప చేశారు. అయితే ఈసభలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ అభిమానులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా ఇప్పటం చేరుకున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...