![]() |
![]() |

లోక నాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం `విక్రమ్`. `ఖైదీ`, `మాస్టర్` వంటి విజయవంతమైన సినిమాల తరువాత లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతమందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేసవి చివరలో అంటే జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
Also Read: అందరూ క్రిటిక్స్ అయిపోయారు.. సినిమా ఎలా తీయాలో నేర్పించండి
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే జూన్ 3న కమల్ హాసన్ నటించిన ఓ క్లాసిక్ మూవీ రిలీజైంది. ఆ చిత్రమే.. `సాగర సంగమం`. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన `సాగర సంగమం`.. 1983 జూన్ 3న విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అలాగే అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకుంది. కమల్ సైతం `ఉత్తమ నటుడు`గా ఇటు `నంది`, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డులని ఈ సినిమాకిగానూ కైవసం చేసుకున్నారు. మరి.. తన కెరీర్ లో ఓ మెమరబుల్ డేట్ గా నిలిచిన జూన్ 3న 39 ఏళ్ళ తరువాత రాబోతున్న కమల్.. `విక్రమ్`తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |