![]() |
![]() |

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుమ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఆయన లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'జయమ్మ పంచాయితీ'. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.
'జయమ్మ పంచాయితీ' విడుదల తేదీని మూవీ టీమ్ వినూత్నంగా ఓ వీడియో ద్వారా ప్రకటించింది. అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ వస్తున్నాయి, మన సినిమా రిలీజ్ ఎప్పుడు అని ఒక వ్యక్తి అడగగా.. మార్చి నుంచి మే వరకు సుమ రకరకాల డేట్స్ చెప్తుంది. మొదట మార్చి 25 అని చెప్పగా 'ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి' అని 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ వినిపించడంతో వామ్మో ఆ డేట్ వద్దులే అంటూ డ్రాప్ అవుతుంది. మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్', ఏప్రిల్ 14 న 'కేజీఎఫ్-2', ఏప్రిల్ 29 న 'ఆచార్య', మే 12 'సర్కారు వారి పాట'.. ఇలా ఏ డేట్ సెలెక్ట్ చేసుకున్నా ఆరోజు పెద్ద సినిమాల విడుదల ఉండటంతో.. చివరికి ఏప్రిల్ 22 తమ సినిమా విడుదలకు కరెక్ట్ డేట్ అని ఆ తేదీని ఫైనల్ చేసినట్లుగా వీడియోలో చూపించారు.
మొత్తానికి సుమ నటించిన 'జయమ్మ పంచాయితీ' ఏప్రిల్ 22 న విడుదల కానుంది. అయితే ఆ తేదీకి వారం ముందు 'కేజీఎఫ్-2', వారం తర్వాత 'ఆచార్య' ఉండటంతో ఈ సినిమాల నడుమ జయమ్మ పంచాయితీ ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |