![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` వేసవి కానుకగా మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ పొలిటికల్ డ్రామా చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, శంకర్ సినిమా రిలీజ్ అయ్యే లోపే ఓ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు రామ్ చరణ్. ఆ వివరాల్లోకి వెళితే.. `మళ్ళీ రావా`, `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారు. తన శైలికి భిన్నంగా ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తీర్చిదిద్దనున్నారు గౌతమ్. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణని జూలై నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, `జెర్సీ`కి హిందీ వెర్షన్ గా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన బాలీవుడ్ `జెర్సీ` ఏప్రిల్ 14న తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించారు.
![]() |
![]() |