![]() |
![]() |

తమిళ్ హీరో విశాల్ కి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన రీసెంట్ తమిళ్ మూవీ 'వీరమే వాగై సూదుం' తెలుగులో 'సామాన్యుడు' పేరుతో విడుదలైంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఫిబ్రవరి 4 న విడుదలైన ఈ సినిమా డివైడ్ సొంతం చేసుకొని ఓ మాదిరిగా ఆడింది. అయితే ఈ సినిమాకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా తెలుగులో విశేష ఆదరణ లభిస్తుండటం విశేషం.
థియేటర్స్ లో విడుదలైన నెల రోజుల తర్వాత మార్చి 4 నుంచి ఈ సినిమాలో ZEE5లో ప్రసారం అవుతోంది. తెలుగుతో తమిళ, కన్నడ వెర్షన్ లు ప్రసారమవుతున్నాయి. అయితే ఈ సినిమాకి తమిళ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుంటున్న ఈ మూవీ.. ఇటీవలే విడుదలైన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'లూజర్', 'మళ్లీ మొదలైంది', 'బంగార్రాజు' వంటి వాటితో పోటీ పడుతుండం విశేషం.
'సామాన్యుడు'లో విశాల్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సీనియర్ యాక్టర్ ఆర్.ఎన్.ఆర్ మనోహర్ నటించిన చివరి సినిమా ఇదే కావడం గమనార్హం.
![]() |
![]() |