![]() |
![]() |

గత ఏడాది `చెక్`, `రంగ్ దే`, `మాస్ట్రో` చిత్రాలతో పలకరించిన యూత్ స్టార్ నితిన్ కి.. ఆయా సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే `మాచర్ల నియోజక వర్గం`పైనే ఆశలు పెట్టుకున్నాడు నితిన్. నూతన దర్శకుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వబోతున్నాడు నితిన్. ఇందులో నితిన్ కి జంటగా `ఉప్పెన` భామ కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా ఎంటర్టైన్ చేయనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, `మాచర్ల నియోజకవర్గం`కి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తాజాగా నితిన్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. హోలి సందర్భంగా మార్చి 18న `మాచర్ల..` ఫస్ట్ లుక్ ని రివీల్ చేసే అవకాశముందట. ఇక టీజర్ విషయానికి వస్తే.. నితిన్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 30న రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. `భీష్మ` తరువాత ట్రాక్ తప్పిన నితిన్ కి `మాచర్ల నియోజక వర్గం`తోనైనా విజయం వరిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |