![]() |
![]() |

యంగ్ హీరో నాగశౌర్య సక్సెస్ చూసి చాలా కాలమే అయింది. `ఛలో`తో కథానాయకుడిగా చివరిసారిగా విజయం అందుకున్న శౌర్య.. ఆపై స్టార్ బ్యూటీ సమంత `ఓ బేబి`లో అతిథి తరహా పాత్రలో అలరించాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో `అశ్వథ్థామ`, `వరుడు కావలెను`, `లక్ష్య`.. ఇలా వరుసగా అపజయాలనే చూస్తూ వస్తున్న నాగశౌర్య.. త్వరలో `కృష్ణ వ్రింద విహారి`తో పలకరించబోతున్నాడు. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 22న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఇదిలా ఉంటే, సరిగ్గా అదే రోజున మరో ఆసక్తికరమైన చిత్రం సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. ఆ సినిమానే.. `జయమ్మ పంచాయితీ`. స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో రూపొందిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 22నే థియేటర్స్ లోకి రాబోతోంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు. మరి.. నాగశౌర్య వర్సెస్ సుమ కనకాల అన్నట్లుగా ఉండబోతున్న ఏప్రిల్ 22 బాక్సాఫీస్ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
![]() |
![]() |