![]() |
![]() |

కొంతకాలం విరామం తర్వాత 'నాతి చరామి' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది పూనమ్ కౌర్. మార్చి 10 నుంచి రికార్డు స్థాయిలో 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తాను హీరో విజయ్ దేవరకొండ సినిమా నటించే అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది.
సినిమాలకు దూరంగా ఉందామని నిర్ణయించుకున్న సమయంలో 'నాతి చరామి' కథ తన దగ్గరకు వచ్చిందని, ఇంట్రెస్ట్ లేకుండానే విన్నానని, విన్నాక బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని పూనమ్ తెలిపింది. పెళ్లి చేసుకొని సినిమాలకి దూరంగా ఉందామనుకున్నానని, కానీ అది జరగలేదని చెప్పింది. తనకి సినిమా అవకాశాలు బాగానే వస్తాయని, కానీ కొందరు రాకుండా చేసారని పేర్కొంది.
అలాగే ఒకసారి విజయ్ దేవరకొండ సినిమాలో నటించే అవకాశమొస్తే వదులుకున్నామని, తన ప్లేస్ లో నటించిన ఆమె రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాలో లీడ్ రోల్ చేసిందని పూనమ్ తెలిపింది. అయితే ఆ సినిమా పేరు, ఆ హీరోయిన్ పేరు చెప్పడానికి పూనమ్ ఇష్టపడలేదు. కానీ పూనమ్ మాటలను బట్టి చూస్తే అది 'గీత గోవిందం' సినిమా అని అర్థమవుతోంది. గీత గోవిందం సినిమాలో హీరోయిన్ నిత్యా మీనన్ ఓ కీ రోల్ నటించింది. ఈ సినిమాలో ఆమెకి విజయ్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు, అంతేకాదు ఆమె ఇచ్చిన ఐడియాతోనే గీతని పెళ్లి చేసుకుంటాడు. పూనమ్ కి ఈ సినిమాలోనే నిత్యా మీనన్ ప్లేస్ లో నటించే అవకాశం వస్తే వదులుకుంది అనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన 'భీమ్లా నాయక్'లో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యామీనన్ నటించింది.
![]() |
![]() |