![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ శుక్రవారం విడుదలైంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. రెండు రోజుల్లో 56 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.202.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ రాధేశ్యామ్ మూవీ.. 204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. రెండు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 56.39 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల బిజినెస్ చేసిన రాధేశ్యామ్.. రెండు రోజుల్లో 37.81 కోట్లు(మొదటి రోజు25.49 కోట్లు, రెండో రోజు 12.32 కోట్లు) కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్ లో 9.15 కోట్లు రాబట్టిన రాధేశ్యామ్.. హిందీలో 4.45 కోట్లు కలెక్ట్ చేసింది. రెస్టాఫ్ ఇండియా 4.98 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్ లాస్ట్ మూవీ సాహోతో పోల్చి చూస్తే హిందీ ఓపెనింగ్స్ బాగా డల్ అయ్యాయి. హిందీలో 50 కోట్ల బిజినెస్ చేసిన రాధేశ్యామ్ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటాలంటే అద్భుతం చేయాల్సి ఉంది. రాధేశ్యామ్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఓవరాల్ గా ఇంకా147.61 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. మార్చి 25 న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల ఉండటంతో.. ఆలోగా రాధేశ్యామ్ మెజారిటీ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.
![]() |
![]() |