![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించిన 'భీమ్లా నాయక్' అప్పుడే రూ.75 కోట్ల షేర్ రాబట్టింది. నాలుగు రోజుల్లోనే 75 కోట్ల షేర్ మార్క్ ని దాటడం విశేషం. భీమ్లా కలెక్షన్ల వేట ఇలాగే కొనసాగితే 100 కోట్ల షేర్ కలెక్ట్ చేయడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు.
రూ.106.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ మూవీ 108 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 69.19 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా వీకెండ్ తర్వాత జోరు కొనసాగిస్తోంది. సోమవారం(నాలుగో రోజు) 6.02 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 75.21 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన భీమ్లా నాయక్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 32.79 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో 88.75 కోట్ల బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ నాలుగు రోజుల్లో 58.25 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణలో 28.24కోట్లు(35 కోట్ల బిజినెస్), ఆంధ్రప్రదేశ్ లో 30.01కోట్లు(53.75 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది. భీమ్లా నాయక్ ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటింది. అక్కడ 9 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన మూవీ నాలుగు రోజుల్లో 10.31 కోట్లు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా 9 కోట్ల బిజినెస్ చేసిన మూవీ ఇప్పటిదాకా 6.65 కోట్లు కలెక్ట్ చేసింది.
![]() |
![]() |