![]() |
![]() |

మహా శివరాత్రి కానుకగా మెగా అభిమానులకు 'భోళా శంకర్' ఫస్ట్ లుక్ తో ట్రీట్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. తమిళ్ మూవీ 'వేదాళం'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మెహెర్ రమేష్ దర్శకుడు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
'భోళా శంకర్' ఫస్ట్ లుక్ ని ఈరోజు ఉదయం విడుదల చేశారు. అందులో మెగాస్టార్ స్టైల్‌గా జీపు మీద కూర్చుని త్రిశూలం లాకెట్ ఉన్న కీ చైన్ ని తిప్పుతూ కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో డప్పులతో జాతర సందడి కనిపిస్తోంది. చూస్తుంటే ఇది ఇంట్రో సాంగ్ లేదా ఫైట్ సీన్ అయ్యుంటుందని అనిపిస్తోంది. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ మెగా ఫ్యాన్స్ ని మెప్పించేలా ఉంది. ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న మెహెర్ రమేష్ ఈ సినిమాతోనైనా విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్.

ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 28 న విడుదల కానుంది. ఆ తర్వాత 'లూసిఫర్' రీమేక్ 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్'తో పాటు బాబీ, వెంకీ కుడుములు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.
![]() |
![]() |