![]() |
![]() |

ఈ మహా శివరాత్రి సినీ ప్రేమికులను సినిమా పండగలా ఉంది. ఇప్పటికే ప్రభాస్ 'ఆదిపురుష్' రిలీజ్ డేట్(జనవరి 12,2023) వచ్చింది. చిరంజీవి 'భోళా శంకర్' ఫస్ట్ లుక్ విడుదలైంది. తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి కూడా 'సర్కారు వారి పాట' మూవీ నుంచి సర్ ప్రైజ్ వచ్చింది.
మహా శివరాత్రి కానుకగా ఈరోజు 'సర్కారు వారి పాట' నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఓ ఫైట్ సీన్ కి చెందిన ఈ స్టిల్ ఆకట్టుకుంటోంది. చుట్టూ రౌడీ గ్యాంగ్ ఆయుధాలు పట్టుకొని నిల్చొని ఉండగా, మహేష్ ఒకతన్ని బలంగా గుద్దగా అతను గాలిలో ఎగురుతుండటం పోస్టర్ లో చూడొచ్చు. మహేష్ ఎప్పటిలాగే అందంగా, స్టైల్ గా కనిపిస్తున్నాడు. 'పోకిరి' తరహా సినిమా అని చెప్పిన మహేష్ 'సర్కారు వారి పాట'తో ఆ రేంజ్ హిట్ కొడతాడేమో చూద్దాం.

పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |