![]() |
![]() |

పలువురు టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా సినిమాలతో నార్త్ లో సత్తా చాటుతున్నారు. 'బాహుబలి', 'సాహో'తో ప్రభాస్, 'పుష్ప ది రైజ్'తో అల్లు అర్జున్ హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే యంగ్ హీరో రామ్ పోతినేని మాత్రం ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయనప్పటికీ కేవలం డబ్బింగ్ సినిమాలతోనే అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ లో మరే సౌత్ హీరోకి సాధ్యం కాని విధంగా రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టించాడు.
సౌత్ హీరోల సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తుంటారు. అలా విడుదల చేసిన వాటిలో ఏ హీరో సినిమాలకు రానంత రెస్పాన్స్ రామ్ సినిమాలకు రావడం విశేషం. 'నేను శైలజ(440 మిలియన్)', 'ఇస్మార్ట్ శంకర్(255 మిలియన్)', 'ఉన్నది ఒకటే జిందగీ(317 మిలియన్)', 'హలో గురు ప్రేమకోసమే(404 మిలియన్)', గణేష్(207 మిలియన్) ఇలా రామ్ సినిమాలు ఎన్నో హిందీలో కోట్ల వ్యూస్ సాధించాయి. హిందీలో డబ్ అయిన రామ్ అన్ని సినిమాలకు కలిపి 2 బిలియన్(200కోట్ల)కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ స్థాయిలో మరే సౌత్ హీరో సినిమాలకు వ్యూస్ దక్కలేదు.

యూట్యూబ్ లో విడుదలైన డబ్బింగ్ సినిమాలతోనే హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రామ్ త్వరలో పాన్ ఇండియా సినిమాలతో పలకరించబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. అలాగే ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న 'ది వారియర్' తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ విడుదల కానుంది.
![]() |
![]() |