![]() |
![]() |

ఎప్పుడెప్పుడా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన 'భీమ్లా నాయక్' సినిమా నిన్న(ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా చాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసిద్దని అంటారు. అలాంటిది భీమ్లా నాయక్ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా భారీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకు తగ్గట్లే మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర పవర్ తుఫాన్ చూపించింది. ఫస్ట్ డే 56.50 కోట్ల గ్రాస్ తో 2022-ఇండియాస్ బిగ్గెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్ గా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.26.42 కోట్ల షేర్ రాబట్టిన భీమ్లా నాయక్.. ప్రపంచవ్యాప్తంగా రూ.36.37 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రూ.106.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ 108 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. నైజాం(తెలంగాణ)లో 35 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేయగా, మొదటిరోజు 11.85 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో 53.75 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ 14.57 కోట్లు రాబట్టింది. రెస్ట్ అఫ్ ఇండియా 3.10 కోట్లు(9 కోట్ల బిజినెస్), ఓవర్సీస్ 6.85కోట్లు(9 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది. భీమ్లా నాయక్ క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా 71.63 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ గత చిత్రం 'వకీల్ సాబ్' మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో 32.24 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా.. భీమ్లా నాయక్ మాత్రం 26.42 కోట్లతో సరిపెట్టుకుంది. దీనిని బట్టి ఏపీలో టికెట్ ధరల తగ్గింపు భీమ్లా నాయక్ పై తీవ్రప్రభావం చూపించిందని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోలాగా ఏపీలో కూడా బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్లు ఎక్కువగా ఉండి ఉంటే.. భీమ్లా నాయక్ మొదటి రోజు కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |