![]() |
![]() |

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలో విడుదలవుతోంది. భారత్‌లో తెలుగు, హిందీ వెర్షన్లతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా వస్తోంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
కాగా 'రాధే శ్యామ్' హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ఈ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఎంతో ఎగ్జయిటింగ్‌కు గురిచేసింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్‌తో అమితాబ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన 'రాధే శ్యామ్'కు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు అంగీకరించారు.
దీంతో తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తున్నారనే ఆసక్తి చాలామందిలో వ్యక్తమైంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ పేరు బయటకు వచ్చింది. తెలుగు 'రాధే శ్యామ్'కు మహేశ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అయితే ఇందులో నిజం లేదని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తేల్చేశాడు. శనివారం ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతి చెప్పాడు. మహేశ్ కాకుండా ఇంకెవరితో చెప్పిస్తున్నారని అడిగితే, ఆ విషయం తర్వాత ఎనౌన్స్ చేస్తామనీ, మహేశ్ అయితే వాయిస్ ఇవ్వట్లేదనీ ధ్రువీకరించాడు. దీంతో ఏ స్టార్ హీరో తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |