![]() |
![]() |

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించిన 'భీమ్లా నాయక్' మూవీ ఫిబ్రవరి 25న విడుదలై, బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారని రిపోర్టులు అందుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 36.37 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా రూ. 26.42 కోట్లు! తెలంగాణలో తొలిరోజు రూ. 11.85 కోట్లు వసూలు చేయడం ద్వారా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు 'భీమ్లా నాయక్'. ఇదివరకటి ఫస్ట్ డే రికార్డ్ 'పుష్ప' పేరుతో ఉంది. ఆ సినిమా రూ. 11.44 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును 'భీమ్లా నాయక్' అధిగమించింది. ఇదివరకు రూ. 9.41 కోట్ల షేర్‌తో రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ 'సాహో' మూడో స్థానానికి పడిపోయింది.
తెలంగాణలో 'భీమ్లా నాయక్' ప్రి రిలీజ్ వాల్యూ రూ. 35 కోట్లు. అంటే ఫస్ట్ డే 33.85 శాతం రికవర్ అయ్యిందన్న మాట. వీకెండ్ నాటికి 60 నుంచి 65 శాతం వరకు రికవర్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో పాటు, విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూస్ రావడం సినిమా కలెక్షన్లకు ప్లస్సవుతుందని చెప్పాలి.
భీమ్లా నాయక్‌గా పవన్ కల్యాణ్, అతనిని ఢీకొట్టే రిటైర్డ్ హవల్దార్ డానియల్ శేఖర్‌గా రానా దగ్గుబాటి పోటా పోటీ నటన, బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ కనెక్షన్‌తో సినిమా ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, సముద్రకని, మురళీశర్మ, రావు రమేశ్ లాంటి తారలు నటించిన ఈ సినిమాని సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేయగా, త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు.
![]() |
![]() |