![]() |
![]() |

అజిత్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'వలిమై' తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 24న విడుదలై ప్రేక్షకుల ఆదరణను, విమర్శకుల ప్రశంసలనూ పొందుతోంది. తమిళనాడులో అయితే తొలిరోజు వసూళ్లపరంగా రికార్డులు క్రియేట్ చేసింది. అక్కడ రూ. 28.25 కోట్లను వసూలు చేసి, అజిత్ సినిమాల్లో ఫస్ట్ డే పరంగా రికార్డ్ సృష్టించిన 'వలిమై', ఓవరాల్‌గా సెకండ్ హయ్యెస్ట్ రికార్డును సాధించింది. ఫస్ట్ డే పరంగా అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమా రికార్డు విజయ్ సినిమా 'సర్కార్' పేరిట ఉంది. అయితే ఆ సినిమా దీపావళి పండగ సందర్భంగా విడుదలవడం గమనించాలి. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన 'వలిమై' విడుదలైనప్పట్నుంచీ అందులోని కంటెంట్ చర్చల్లో నిలిచింది.
కాగా, సినిమా లెంగ్త్ విషయంలో ఫిర్యాదులు రావడం, ముఖ్యంగా సెకండాఫ్ సుదీర్ఘంగా సాగిందనే ఫీలింగ్ కలిగించడంతో, సినిమాని ట్రిమ్ చేయాలని 'వలిమై' టీమ్ నిర్ణయించుకుంది. తమిళ, తెలుగు వెర్షన్లను 12 నిమిషాలు, హిందీ వెర్షన్‌ను 15 నిమిషాల పాటు ట్రిమ్ చేశారు. దీంతో పాటు హిందీ వెర్షన్‌లో ఫస్ట్ సాంగ్‌ను కూడా తొలగించారు. ఈ మార్పులు ఈరోజు ఈవెనింగ్ షోల నుంచే జరుగుతాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. గురువారంతో పోలిస్తే, తమిళ వెర్షన్ టికెట్ ధరలు శుక్రవారం తగ్గాయి. ఫస్ట్ డే మాదిరిగానే సెకండ్ డే కూడా డబుల్ డిజిట్‌లో కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.
బోనీ కపూర్ నిర్మించిన 'వలిమై' మూవీలో తెలుగు హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా, హిందీ తార హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా నటించారు.
![]() |
![]() |