![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆదిపురుష్'. ఈ మైథలాజికల్ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. అయితే ఈ సినిమాలో వీరి పాత్రల పేర్లు ఇవి కాదని చెప్పి షాకిచ్చాడు డైరెక్టర్ ఓంరౌత్.
రీసెంట్ గా నేషనల్ మీడియాతో ముచ్చటించిన ఓంరౌత్ 'ఆదిపురుష్' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది రామయాణ గాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అయినప్పటికీ ఇందులో ప్రభాస్ పేరు రాముడు కాదని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవ్ పాత్రలో కనిపిస్తాడని ఓంరౌత్ చెప్పారు. రాముడు అనగానే ఆడియన్స్ ఆ పాత్రను దేవుడిగానే చూస్తారని, అలా కాకుండా ఓ గొప్ప పాత్రగా చూడాలనే ఉద్దేశంతోనే ఆ పాత్రకి రాఘవ్ అనే పేరును పెట్టామని అన్నారు. అలాగే కృతిసనన్ పాత్ర పేరు జానకి అని, సైఫ్ అలీఖాన్ పాత్ర పేరు లంకేష్ అని చెప్పుకొచ్చారు.
2000లో ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో చూసిన ఓ యానిమేషన్ సినిమానే రామాయణం తెరకెక్కించాలన్న ఆలోనకు మూలమని ఓంరౌత్ అన్నారు. ఒక విదేశీ వ్యక్తి రామాయణ కథను ఈ జనరేషన్ కు అంత గొప్పగా చెపితే, మనం ఏం చేస్తున్నామన్న ఆత్మ విమర్శ నుంచే ఆదిపురుష్ ఆలోచన వచ్చిందని ఓంరౌత్ తెలిపారు.
![]() |
![]() |