![]() |
![]() |

అభినయానికి ఆస్కారమున్న పాత్రలకే ఓటేసే కథానాయికల్లో నిత్యా మీనన్ ఒకరు. దశాబ్దానికి పైగా నాయికగా రాణించిన నిత్య.. త్వరలో `భీమ్లా నాయక్`లో సందడి చేయనుంది. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జంటగా ఎంటర్టైన్ చేయనుంది నిత్యా మీనన్. ఫిబ్రవరి 25న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. రీసెంట్ టైమ్స్ లో స్టార్ హీరోలకు జోడీగా కనిపించిన ప్రతీసారి నిత్యకి మంచి విజయాలే దక్కాయి. `సన్నాఫ్ సత్యమూర్తి`లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, `24`లో కోలీవుడ్ స్టార్ సూర్య, `జనతా గ్యారేజ్`లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, `మెర్సల్` (తెలుగులో `అదిరింది`)లో ఇళయ దళపతి విజయ్ తో కలిసి యాక్ట్ చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆయా సినిమాలు విజయాన్ని అందించాయి. మరి.. సెంటిమెంట్ రిపీటై పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లోనూ `భీమ్లా నాయక్`తో హిట్ అందుకుంటుందేమో చూడాలి.
Also Read: ఈ ఏడాదే విజయ్-రష్మిక పెళ్లి?
కాగా, సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన `భీమ్లా నాయక్`కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చాడు.
![]() |
![]() |