![]() |
![]() |

'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అవార్డ్స్ లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ ను గెలుపొందింది.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్- 2022 వేడుక ఆదివారం ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2021లో విడుదలై, విశేష ఆదరణ పొందిన సినిమాలు అవార్డులు అందుకున్నాయి. గతేడాది చివరిలో డిసెంబర్ 17 న విడుదలైన అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్' ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. అలాగే బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా 'మనసానమః' అవార్డు గెలుచుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ లో తెలుగు సినిమా, తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డులు గెలుచుకోవడంతో తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

'మనసానమః' షార్ట్ ఫిల్మ్ కి దీపక్ దర్శకత్వం వహించాడు. 'చైత్రమాసం, వర్షాకాలం, శీతాకాలం' ఇలా మూడు కాలాల్లో ప్రేమలో సూర్య ఎదుర్కొనే పరిణామాలను డైరెక్టర్ ఎంతో అందంగా చూపించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా విరాజ్ అశ్విన్, హీరోయిన్లుగా దృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీశర్మ నటించారు.
![]() |
![]() |