![]() |
![]() |

`ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయం అందుకున్నాడు యువ కథానాయకుడు కార్తికేయ. ఆపై అరడజను చిత్రాల్లో నటించినా.. ఆ స్థాయి విజయం కాదు కదా, కనీసం సక్సెస్ అనే మాటకి కూడా నోచుకోలేకపోయాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. కాకపోతే, నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `గ్యాంగ్ లీడర్`.. కార్తికేయకి నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చింది. ఇందులో తొలిసారిగా ప్రతినాయకుడిగా కనిపించాడు కార్తికేయ. తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు.
Also Read: ఇప్పుడు మేకపాటి.. అప్పుడు పునీత్.. ఇంచుమించు ఒకేలా!
కట్ చేస్తే.. రెండున్నరేళ్ళ తరువాత మరోసారి విలన్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడు కార్తికేయ. ఈ సారి ఏకంగా ఓ స్టార్ హీరోనే ఢీ కొడుతున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు.. కోలీవుడ్ టాప్ హీరో అజిత్ కుమార్. తమిళ చిత్రం `వలిమై` కోసం అజిత్ కి బ్యాడీగా మారాడు కార్తికేయ. తెలుగులోనూ అనువాద రూపంలో అలరించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఫిబ్రవరి 24న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఆ రోజు నాని పుట్టినరోజు. మరి.. నాని కాంబినేషన్ అంతగా కలిసిరాని కార్తికేయకి.. నాని బర్త్ డే (ఫిబ్రవరి 24) అయినా ప్లస్సవుతుందేమో చూడాలి.
![]() |
![]() |